పుర ఎన్నికల్లో పోటీ చేసేందుకు విద్యావంతులు ముందుకొస్తున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 31వ వార్డు వైకాపా అభ్యర్థిగా బత్తిన నవీన్ కుమార్ బరిలో నిలిచారు. రాజకీయాల్లో అనుభవం ఉన్న తండ్రి బత్తిన నాగరాజు ఆరోగ్యం క్షిణించడంతో బీటెక్, ఎంబీఏ చదివిన నవీన్ కుమార్ 23 ఏళ్ల వయస్సులో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చాడు. తన వార్డులోని సమస్యల పరిష్కారానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానంటూ గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నాడు.
పురపోరు: పోటీ చేసేందుకు విద్యావంతుల ఆసక్తి - మున్సిపల్ ఎన్నికలు తాజా వార్తలు
పుర ఎన్నికల్లో పోటీ చేసేందుకు విద్యావంతులు ఆసక్తి చూపుతున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 31వ వార్డు వైకాపా అభ్యర్థిగా ఎంబీఏ చదివిన నవీన్ కుమార్ పోటీ చేస్తున్నాడు. తనను గెలిపిస్తే వార్డులోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెబుతున్నాడు.
పుర పోరులో యువత