Murder: విశాఖ మర్రిపాలెం రైల్వే క్వార్టర్స్ వద్ద యువకుడు దారుణం హత్యకు గురయ్యాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు, ఎయిర్ పోర్ట్ పోలీసులు ఘటనపై ఆరా తీశారు. మృతుని తలపై తీవ్ర గాయాలై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతిచెందిన యువకుడు స్థానిక గాంధీనగర్ ప్రాంతానికి చెందిన రేపాక తేజగా పోలీసులు గుర్తించారు.
Murder: విశాఖ మర్రిపాలెం రైల్వే క్వార్టర్స్ వద్ద యువకుడి హత్య.. - విశాఖ మర్రిపాలెం రైల్వే క్వార్టర్స్ వద్ద యువకుడి హత్య
Murder: విశాఖ మర్రిపాలెం రైల్వే క్వార్టర్స్ వద్ద దారుణం జరిగింది. స్నేహితులతో కలిసి మద్యం తాగేందుకు వెళ్లిన తేజ అనే యువకుడు.. హత్యకు గురయ్యాడు. మద్యం సేవించే సమయంలో.. తేజకు మరో యువకునితో ఘర్షణ జరిగింది. తేజను కొందరు యువకులు చితకబాదుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
గత రాత్రి అతని స్నేహితులతో కలిసి మద్యం సేవించేందుకు.. మర్రిపాలెం రైల్వే క్వార్టర్స్ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన అతని స్నేహితుడు బంగార్రాజుకి, తేజ కు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణలో బంగార్రాజు అతడి స్నేహితులు తేజను హతమార్చారని తేజ బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా.. తేజను కొందరు యువకులు చితకబాదుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు, ఎయిర్ పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
TAGGED:
ap latest news