విశాఖజిల్లా ఎస్. రాయవరం మండలం అడ్డురోడ్డుకు చెందిన వసంత రెడ్డి... గత నెల 19న హత్యకు గురయ్యాడు. అన్నదమ్ముల మధ్య జరిగిన ఆస్తి తగాదాల కారణంగా వసంతరెడ్డిని, అతని తమ్ముడు జాన్ ప్రకాష్ రెడ్డి మరికొందరితో కలసి హతమార్చాడు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అడ్డురోడ్డుకు చెందిన లక్ష్మీకాంతమ్మకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు వసంతరెడ్డి కొరుప్రోలు పీహెచ్సీలో హెల్త్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. రెండో కుమారుడు తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో స్థిరపడ్డారు.
ఆస్తి తగాదాల్లో అన్న ప్రాణం తీసిన తమ్ముడు..! - అస్తి తగాదాల్లో అన్న ప్రాణం తీసిన తమ్ముడు
ఆస్తి తగాదాల కారణంగా అన్నను తమ్ముడు హత్యచేసిన సంఘటన విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డులో జరిగింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నక్కపల్లి సీఐ విజయ్ కుమార్