ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శుభ్రతకు నడుము బిగించి 'శ్రమ'దానం చేసిన యువత - young stars sramadhan latest news

ఆ గ్రామంలో మూడు నెలలుగా వీధుల్లో చెత్త పేరుకుపోయింది. మురుగు కాలువలు పూడిపోయాయి. అధికారులకు విన్నవించుకున్నా.. పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. దోమలతోపాటుగా గ్రామంలో వ్యాధులు వ్యాపిస్తున్నాయి. విషయం గమనించిన యువత, నడుం బిగించి శ్రమదానంతో గ్రామాన్ని శుభ్రపరిచారు. ఇంతకీ ఎక్కడా గ్రామం.. ఏమా కథ.. తెలుసుకుందాం పదండి...

young stars start sramadhan
పరిశుభ్రతకు నడుము బిగించిన యువత

By

Published : Jun 27, 2020, 3:52 PM IST


ఊరంతా చెత్త పేరుకుపోయి కంపుకొడుతోంది. దోమల వ్యాప్తితో వ్యాధులు వ్యాపిస్తున్నాయి. అధికారులు మాత్రం పట్టించుకోలేదు. దీంతో స్పందించిన విశాఖ జిల్లా చీడికాడ మండలంలోని వింటిపాలెం గ్రామానికి చెందిన యువత శ్రమదానం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు యువత, గ్రామస్థులు కలిసి ఊరంతా తిరిగి చెత్తను తొలగించి తగలబెట్టారు. మురుగు కాలువల్లో చెత్తను శుభ్రపరిచారు. చెత్తను పూర్తిగా తగలబెట్టడం వల్ల గ్రామమంతా పరిశుభ్రంగా మారింది. యువత చేసిన శ్రమదానానికి గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details