ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని మల్కన్‌గిరి జిల్లాలో వేసవి తాపనికి ఓ పాము సొమ్మసిల్లింది. జిల్లా కేంద్రంలోని నువగుడా వీధిలో ఓ ఇంట్లోకి నాగుపాము వచ్చింది. పామును చూసిన ఆ ఇంట్లో వాళ్లు... స్నేక్ హెల్ప్‌లైన్ టీంకు తెలిపారు. స్నేక్ హెల్ప్‌లైన్‌కు చెందిన సభ్యుడు స్నేహసిస్ పట్నాయక్ వచ్చి పామును బయటకి తీశారు.
వేసవి తాపానికి అప్పటికే ఆ పాము సొమ్మసిల్లి ఉన్నట్టు గుర్తించారు. స్ట్రాతో పాముకు గాలి ఊది బతికించాడు. స్నేహసిస్ పట్నాయక్ పనిని స్థానికులు ప్రశంసించారు. గాలి ఊదిన తర్వాత పాము మెల్లగా కదలింది. తీవ్ర ఎండ కారణంగా... పాము సొమ్మసిల్లింది అని స్నేహసిస్ పట్నాయక్ తెలిపారు.