సతీష్.. విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన యువకుడు. అతడికి మూగజీవాలంటే మమకారం. పక్షులంటే ప్రాణం. ఎక్కడైనా వింత పక్షులు, జీవాలు కనిపిస్తే చాలు ఠక్కున అక్కున చేర్చుకుని వాటి ఆకలి తీర్చుతుంటాడు. సతీష్ ఓ పని మీద నర్సీపట్నం వెళుతూ రహదారిలో చెట్టుపై నుంచి కింద పడిపోయిన ఉడుత పిల్లను చూశాడు.
చలించిపోయాడు. కనీసం కళ్ళు కూడా తెరవలేని స్థితిలో ఉన్న ఆ పసి ఉడుతను తన వెంట తీసుకువెళ్లాడు. ప్రతీరోజు పాలు పడుతూ ఆకలి తీరుస్తున్నాడు. ఆ చిన్ని ఉడుతను తానే పెంచుకుంటాని చెప్పాడు.