విశాఖ జిల్లా చీడికాడ మండలం దుండిసురవరానికి చెందిన పరమేశ్ ఆదివారం సాయంత్రం తన తల్లితో కలిసి పశువుల మేత కోసం వెళ్లాడు. పరమేశ్ బహిర్బూమికి పొలం సమీపంలోకి బొడ్డేరు నది వద్దకు వెళ్లాడు. అయితే ఎంతకీ తిరిగి రాకపోవటంతో తల్లి నది వద్దకు వెళ్లి చూసింది. ఆచూకీ లభించకపోవటంతో పెద్దగా కేకలు వేసింది. సమీపంలో ఉన్న రైతులు వచ్చి నదీలో గాలింపు చర్యలు చేపట్టారు. నదీలో వరద నీరు ఉద్ధృతంగా ప్రవాహించటంతో పాటు చీకటి పడటంతో పరమేశ్ ఆచూకీ లభించలేదు. యువకుని కుటుంబీకులు... పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
బొడ్డేరు నదీలో గల్లంతైన యువకుడు - vishakapatnam latest news
విశాఖ జిల్లా దండివరం సమీపంలోని బొడ్డేరు నదీలో ఓ యువకుడు కొట్టుకుపోయాడు. నదీలో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించటంతో యువకుని ఆచూకీ లభించలేదు.
బొడ్డేరు నదీలో కొట్టుకుపోయిన యువకుడు