విశాఖలో యువకుడి కిడ్నాప్ కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. పిచ్చారావు, కుమార్, తరుణ్, ప్రసాద్, వెంకటేష్, శంకర్, శ్రీరాములు.. రాజేష్ అనే యువకుడిని కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు తూర్పుగోదావరి జిల్లా కడియం వద్ద కిడ్నాపర్లను పట్టుకున్నారు. ఉద్యోగాల పేరుతో రాజేష్ మోసాలకు పాల్పడినట్లు నిందితులు వెల్లడించారు. గుంటూరులో శ్రీరాములు రాజేష్‌పై ఫిర్యాదు చేసిన బాధితులు ఉన్నారని కిడ్నాపర్లు పేర్కొన్నారు. రాజేష్‌ను పోలీసులకు అప్పగించేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. అయితే నిందితులపై అపహరణ కేసు నమోదు చేసి రిమాండ్ రు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులకు అప్పగించేందుకే తీసుకెళ్తున్నాం: కిడ్నాపర్లు - kidnap case in visaka district news update
విశాఖలో యువకుడి కడ్నాప్ కేసులో నిందితులను తూర్పుగోదావరి జిల్లా కడియం వద్ద పోలీసులు పట్టుకున్నారు. రాజేష్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. నిందితులపై అపహరణ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
యువకుడిని కిడ్నాప్ చేసిన నిందితులు అరెస్టు