దుబాయ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విశాఖ మల్కాపురానికి చెందిన యువకుడు దూబ కృష్ణ మృతదేహాన్ని స్వస్ధలానికి రప్పించేందుకు సాయం చేయాలని కుటుంబ సభ్యులు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుని కలిసి విజ్ఞప్తి చేశారు. విషయం తెలుసుకున్నమంత్రి ఇండియన్ ఎంబసీ, కంపెనీ ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడి వీలైనంత త్వరగా మృతదేహం విశాఖ తరలించాలని మంత్రి కోరారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని కుటుంబసభ్యులకు భరోసా కల్పించారు. దుబాయ్‌లోని ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో వెల్డర్‌గా గత ఆరు సంవత్సరాలుగా కృష్ణ పని చేస్తూ మూడు రోజులు క్రితం దుబాయ్‌లో మృతి చెందాడు.
దుబాయ్‌లో మృతి చెందిన కృష్ణ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించండి - young man died road accident in dubai
విశాఖ జిల్లా మల్కాపురానికి చెందిన దూబ కృష్ణ అనే యువకుడు దుబాయ్‌లో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అతని మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని కుటుంబ సభ్యులు.. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసుకి విజ్ఞప్తి చేశారు. ఆయన ఇండియన్ ఎంబీసీ, కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. వీలైనంత త్వరగా బాడీని తరలించాలని కోరారు.
దుబాయ్‌లో మృతి చెందిన కృష్ణా మృతదేహం స్వస్థలానికి తరలించండి