చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన చేస్తున్న యువత అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. చరవాణికి సంబంధించి అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదంలో అన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖ జగదాంబకూడలి సమీపంలో సాలిపేటకు చెందిన దంపతులు సూర్యబాగ్ ప్రాంతంలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు(17) ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. నిత్యం సెల్‌ఫోన్‌లో వీడియో గేమ్స్ ఆడేవాడు. వారం రోజుల క్రితం సెల్‌ఫోన్ పనిచేయకపోవడంతో మరమ్మతులకు ఇచ్చాడు.
ఫోన్ తీసుకురాలేదని.. ప్రాణం తీసుకున్నాడు - news on phone death at vishakapatnam
అన్నదమ్ముల మధ్య ఫోన్ వివాదం... నిండు ప్రాణం బలితీసుకుంది. సెల్ ఫోన్ తీసుకురాలేదన్న మనస్థాపంతో... అన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విశాఖ జిల్లా జగదాంబకూడలి, సాలిపేటలో చోటు చేసుకుంది.
సోమవారం సాయంత్రం దుకాణం వద్దకు వెళ్లి సెల్‌ఫోన్ తీసుకురమ్మని తమ్ముడి(15)కి చెప్పాడు. తమ్ముడు నిరాకరించడంతో మనస్థాపంతో ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్నాడు. తల్లిదండ్రులు తలుపులు ఎంతకొట్టినా తీయక పోయేసరికి అనుమానం వచ్చి కిటికీలోనుంచి చూశారు. కుమారుడు ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. తలుపులు పగలగొట్టి కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ తేలిగ్గా తీసుకోం.. జోక్ అనుకుంటున్నారా?: హైకోర్టు