ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనకాపల్లిలో యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య - vishaka district

ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ నాగులాపల్లి వీధిలో చోటు చేసుకుంది.

vishaka district
అనకాపల్లిలో యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య

By

Published : Jul 12, 2020, 12:47 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ నాగులాపల్లిలో ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒడిశా రాష్ట్రంలోని రాయగడలో ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్​గా పని చేస్తున్న దొడ్డి వెంకట అరవింద్(26) మూడు రోజుల క్రితం అనకాపల్లి వచ్చాడు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఆన్​లైన్​లో జూదం ఆడి డబ్బులు పోగొట్టుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపడుతున్నారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనకాపల్లి సిఐ భాస్కర రావు తెలిపారు

ఇదీ చదవండిప్రభుత్వ మార్గదర్శకాలను ప్రజలు కచ్చితంగా పాటించాలి- ఆర్డీవో

ABOUT THE AUTHOR

...view details