ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రేమ పేరుతో యువకుడి మోసం... యువతి ఆత్మహత్య - భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య

ప్రియుడు పెళ్లికి నిరాకరించటంతో మనస్థాపం చెందిన ప్రియురాలు అపార్ట్​మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ప్రేమ పేరుతో యువకుడి మోసం...భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య !ప్రేమ పేరుతో యువకుడి మోసం...భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య !
ప్రేమ పేరుతో యువకుడి మోసం...భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య !

By

Published : Jul 31, 2020, 11:34 AM IST

ప్రియడు పెళ్లికి నిరాకరించటంతో ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగింది. డీసీపీ పి. సరేశ్ కథనం ప్రకారం... ఒడిశా రాయఘడ్ ప్రాంతానికి చెందిన కావేటి వైష్టవి చిన్నముసిడివాడ ప్రాంతానికి చెందిన షణ్ముక తేజలు నగరంలోని ఓ ప్రైవేటు సంస్థలో వేరువేరుగా ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిరువురు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వైష్ణవి గురువారం మధ్యాహ్నం చిన్నముసిడివాడలోని తేజ నివాస సముదాయానికి వచ్చి తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. తేజ పెళ్లికి నిరాకరించటంతో వీరి మధ్య ఘర్షణ తలెత్తింది. అనంతరం మనస్థాపంతో వైష్ణవి అపార్ట్​మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకన్నామని తెలిపిన డీసీపీ మరింత సమాచారం కోసం ఆరా తీస్తున్నట్లు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details