విశాఖ జిల్లా అనకాపల్లి మండలం గోపాలపురానికి చెందిన రాము అప్పల నరసమ్మకు పూర్ణ ఒక్కగానొక్క కుమార్తె. వచ్చే ఏడాది మేనమామతో వివాహం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ సమయంలో అనుకోకుండా గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో పూర్ణ మృతి చెందటంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. యువతి బంధువులు మృతదేహం వద్ద విలపిస్తున్న ఘటన గ్రామస్థులను కలిచివేసింది. అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి, శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ నివాళులర్పించారు.
విశాఖ జిల్లా గోపాలపురంలో విషాదం - young girl died in a boat accident
గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన విశాఖ జిల్లా గోపాలపురానికి చెందిన పూర్ణ(18) అనే యువతి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
విశాఖ జిల్లా గోపాలపురంలో విషాదం