ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామానికి గ్రామం నీట మునక... కనుచూపు మేరలో ఎటు చూసినా వరదే! - y.lova village submerged in rain water

భారీ వర్షాల కారణంగా శారద నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. విశాఖ జిల్లాలోని రాంబిల్లి మండలం.. వై.లోవ గ్రామం నీట మునిగింది. కనుచూపు మేరలో.. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది.

గ్రామానికి గ్రామం నీట మునక... కనుచూపు మేరలో ఎటు చూసినా వరదే!
గ్రామానికి గ్రామం నీట మునక... కనుచూపు మేరలో ఎటు చూసినా వరదే!

By

Published : Oct 15, 2020, 2:44 AM IST

విశాఖ జిల్లా రాంబిల్లి మండలంలో భారీ వర్షాల కారణంగా శారదా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు.. రాంబిల్లి మండలం లోని వై.లోవ గ్రామం నీటితో నిండిపోయింది. వర్ష ప్రభావం వల్ల జనజీవనం స్తంభించింది.

గ్రామానికి గ్రామం నీట మునక

అనేక పశువులు వర్షంలో తీవ్ర ఇబ్బంది పడ్డాయి. ఎదిగిన పంటలు నీటి మునిగిపోయాయి. కనుచూపుమేరలో ఎటు చూసినా నిలిచిపోయిన వరద నీరే కనిపించింది. జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేసి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details