ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎలమంచిలి పోలీసులు విస్తృత ప్రచారం - ఎలమంచిలి తాజా వార్తలు

ఎలమంచిలిలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేశారు. ప్రజలను భౌతిక దూరం పాటించాలని, మాస్కులు వేసుకోవాలని కోరారు.

yelamanchili police officers awareness programme about corona virus
ఎలమంచిలి పోలీసులు విస్తృత ప్రచారం

By

Published : May 3, 2020, 11:08 AM IST

విశాఖ జిల్లా ఎలమంచిలి సర్కిల్ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి పోలీసులు విస్తృతంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్లు, ప్రధాన కూడళ్లు, దుకాణాల వద్ద పోలీసులు మైకు పట్టుకుని భౌతిక దూరం పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కులు వేసుకోవాలని, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రచారం చేశారు. ఎలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం, మునగపాక మండలంలో పోలీసులు ఆదివారం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలను చైతన్య పరచడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని స్థానిక సీఐ వెంకటరమణ తెలిపారు. ప్రచారం కోసం ప్రత్యేక వాహనాలను సమకూర్చారు.

ఎలమంచిలి పోలీసులు విస్తృత ప్రచారం

ABOUT THE AUTHOR

...view details