పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం వైకాపా నాయకులు దౌర్జన్యాలు, దాడులకు దిగుతున్నారని తెదేపా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పల్లా శ్రీనివాస్ ఆరోపించారు. భీమిలి మండలం పెదనాగుమయ్యపాలెం పంచాయతీలో వైకాపా కార్యకర్తల దాడిలో గాయపడి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాంబాబును.. తెదేపా నాయకులు పరామర్శించారు.
'ఏకగ్రీవాల కోసం వైకాపా అరాచకాలు'
పంచాయతీ ఎన్నికల్లో వైకాపా నాయకులు ఏకగ్రీవాల కోసం అక్రమాలకు పాల్పడుతున్నారని.. తెదేపా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం సమన్వయకర్త పల్లా శ్రీనివాస్ ఆరోపించారు.
ఏకగ్రీవాల కోసం వైకాపా అరాచకాలు
వైకాపా నాయకుల కార్యకర్తలకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలిచే సత్తా లేక.. ఇలా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వారి దౌర్జన్యాలకు పోలీసులు కూడా వత్తాసు పాడుతూ అన్యాయాన్ని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. రాంబాబుపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.