విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలక ఎన్నికలలో అధికార పార్టీ వైకాపా విజయకేతనం ఎగురవేసింది. పట్టణంలో 28 వార్డులు ఉండగా.. 14 వార్డుల్లో వైకాపా , 12 వార్డుల్లో తెదేపా విజయం సాధించింది. జనసేన ఒక స్థానంలో గెలవగా.. స్వతంత్య్ర అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు.
నర్సీపట్నం మున్సిపాలిటీలో వైకాపా విజయం
విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా గెలుపొందింది. పట్టణంలో 28 వార్డులు ఉండగా.. 14 వార్డుల్లో వైకాపా , 12 వార్డుల్లో తెదేపా విజయం సాధించింది. జనసేన ఒక స్థానంలో గెలవగా.. స్వతంత్య్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలిచారు.
నర్సీపట్నం మున్సిపాలిటీ వైకాపా కైవసం
గెలుపొందిన వైకాపా అభ్యర్థులతో నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ సమావేశమై ప్రత్యేక అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్...ప్రవేశపెట్టిన పథకాలు తమ అభ్యర్థుల విజయానికి కారణమయ్యాయని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. మున్సిపాలిటీలో వైకాపా అభ్యర్థులను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి:విశాఖ కార్పొరేషన్‌లో వైకాపా ఆధిక్యం
Last Updated : Mar 14, 2021, 4:18 PM IST