ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా అభ్యర్థులను గెలిపించుకుంటాం' - దాడి

అనకాపల్లి పార్లమెంట్, శాసనసభ వైకాపా అభ్యర్థులను గెలిపించుకుంటామని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు  స్పష్టం చేశారు.

దాడి వీరభద్రరావు

By

Published : Mar 19, 2019, 11:15 PM IST

దాడి వీరభద్రరావు
అనకాపల్లి పార్లమెంట్, శాసనసభ వైకాపా అభ్యర్థులను గెలిపించుకుంటామని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు స్పష్టం చేశారు. అనకాపల్లిలో వైసీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఆయన... తన సూచన మేరకే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను జగన్ ఖరారు చేశారని అనుచరులకు వివరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వైకాపా అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. తనతో పాటు తన కుమారుడు రత్నాకర్ కూడా వైకాపా గెలుపునకు కృషి చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో తెదేపా పాలనలో అవినీతి పెచ్చుమీరిందని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details