తెదేపాలోకి విశాఖ వైకాపా ఇన్‌ఛార్జి టి. విజయకుమార్ - తెదేపాలో చేరిక
వైకాపాను మరో నాయకుడు వీడారు. ఉత్తరాంధ్రకు కేంద్రమైన విశాఖ లోక్‌సభ నియోజకవర్గానికి వైకాపా ఇన్‌ఛార్జ్‌గా ఉన్న టి.విజయ్‌కుమార్.. తెదేపాలో చేరారు.
vijaykumar
విశాఖ లోక్‌సభ నియోజకవర్గ వైకాపా ఇన్చార్జ్... టి. విజయకుమార్ సీఎం చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి వచ్చిన ఆయన... ఉగాది రోజున అధికార పార్టీలో కలిశారు. గతంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయకుమార్ ఎన్నికయ్యారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి శాయశక్తులా పని చేస్తానని చెప్పారు.