విశాఖ జిల్లా చోడవరం మండలం గంధవరంలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో గంధవరం సర్పంచ్ ఇంద్రజ సహా ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్, అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.
ప్రచారం తెచ్చిన తంటా..
గంధవరం గ్రామానికి చెందిన తెదేపా, వైకాపా నాయకులు గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థికి మద్దతుగా విశాఖకు వెళ్లి పనిచేశారు. గ్రామ తెదేపా నాయకులు విశాఖకు వెళ్లిన విషయం సామాజిక మాధ్యమాల ద్వారా గ్రామంలో తెలిసింది. ఈ విషయం ఇరు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. తెదేపా నాయకుడు, గంధవరం మాజీ సర్పంచ్ పల్లా అర్జున్ వర్గీయులు, వైకాపా మండల శాఖ అధ్యక్షుడు పల్లా నర్సింగరావు కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఈ దాడిలో వైకాపాకు చెందిన గ్రామ సర్పంచి పల్లా ఇంద్రజ, ఆమె సోదరులు గాయపడ్డారు. వైకాపా నాయకులు ప్రతిగా తెదేపా నాయకులపై దాడికి దిగి అర్జున్ కుటుంబ సభ్యులను గాయపర్చారు.
ఇదీ చదవండి:350 కిలోల గంజాయి పట్టివేత... సరుకు విలువ రూ.కోటిన్నర?