ఉత్తరాంధ్ర వైకాపా సోషల్ మీడియా కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం విశాఖలో ఆదివారం జరిగింది. విశాఖ మహా నగరాభివృద్ధి సంస్థ చిన్నారుల ప్రాంగణం ఈ కార్యక్రమానికి వేదికైంది. రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి ఈ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ వైకాపా అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ ఈ సమ్మేళనానికి నేతృత్వం వహించారు.
విశాఖలో వైకాపా సోషల్ మీడియా కార్యకర్తల సమావేశం - విశాఖ ఎంపీ విజయసాయి రెడ్డి తాజా వార్తలు
ఉత్తరాంధ్ర వైకాపా సోషల్ మీడియా కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం విశాఖలో జరిగింది. ఎంపీ విజయ సాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
![విశాఖలో వైకాపా సోషల్ మీడియా కార్యకర్తల సమావేశం YSRCP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9787220-1017-9787220-1607269982823.jpg)
YSRCP