విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైకాపా వ్యతిరేకిస్తోందని... ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్న విజయసాయిరెడ్డి... చంద్రబాబు హయాంలో 56 సంస్థలను అమ్మేశారని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై చంద్రబాబు మాటలు హాస్యాస్పదమని ధ్వజమెత్తారు. కొందరు చంద్రబాబు వ్యక్తులు బ్యాంకులను దివాలా తీయించారని ఆరోపించారు. కేంద్ర సంస్థలను అమ్మాలని... కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. నిర్మలా సీతారామన్‌ను కలిసి ప్రైవేటీకరణ చేయవద్దని కోరామని వెల్లడించారు. సొంతగనులు లేకపోవడమే విశాఖ ఉక్కు నష్టాలకు కారణమని స్పష్టం చేశారు. ఒడిశా గనులను విశాఖ ఉక్కుకు కేటాయించాలని కోరినట్టు చెప్పారు.
'విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైకాపా వ్యతిరేకిస్తోంది' - Vijaya Sai Reddy comments on vizag steel plant
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై చంద్రబాబు మాటలు హాస్యాస్పదమని... వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైకాపా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. నిర్మలా సీతారామన్‌ను కలిసి ప్రైవేటీకరణ చేయవద్దని కోరామని వెల్లడించారు.
వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి