స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా అన్ని స్థానాసను కైవసం చేసుకుంటుందని మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు అన్నారు. విశాఖ జిల్లాలో అన్ని మండలాల్లోనూ వైకాపా నుంచి టిక్కెట్లు ఆశించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. గిరిజన ప్రాంతంలో వైకాపాకు చక్కటి ఆదరణ ఉందని తెలిపారు. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని ఇతర పార్టీల్లోని ముఖ్య నాయకులంతా వైకాపాలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజాసంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. పార్టీ కోసం పని చేసిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని పేర్కొన్నారు.
'గిరిజన ప్రాంతంలో వైకాపాకు మంచి ఆదరణ'
విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులే అన్ని స్థానాల్లోనూ విజయ బావుటా ఎగురవేసి సత్తా చూపుతారని మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు అన్నారు. జిల్లాలోని అరకు నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్లు ఖరారుకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ, అరకు ఎంపీ మాధవితో చర్చించారు.
అరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపై వైకాపా కసరత్తు
Last Updated : Mar 10, 2020, 9:30 PM IST