విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. నగరంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో.. ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. డిపాజిట్ కూడా దక్కదేమోనని భయపడి చంద్రబాబునాయుడు విశాఖలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడే వైకాపా అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.
'గ్రేటర్ విశాఖలో వైకాపా ఘన విజయం సాధిస్తుంది' - vizag latest news
తెదేపా అధినేత చంద్రబాబునాయుడుపై వైకాపా ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోతానని భయపడి విశాఖలో ప్రచారం నిర్వహిస్తున్నారని ఆక్షేపించారు.

వైకాపా ఎమ్మెల్యే మేరుగ నాగార్జున