తెదేపా అధికారంలో ఉండగా విశాఖకు ఏమి న్యాయం చేశారని వైకాపా అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీయాలని తెదేపా అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు చేసిన ఏ ఒక్క ఆరోపణపైనైనా ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన విశాఖను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తాము అభివృద్ధి చేస్తుంటే అడ్డుకుంటున్నారని విమర్శించారు.