ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నర్సీపట్నంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పాదయాత్ర - వైకాపా నేతల పాదయాత్ర తాజా వార్తలు

ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేశామని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. ప్రజాసంకల్పయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు.

ycp leaders walk in narsipatnam at viakhapatnam district
నర్సీపట్నంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పాదయాత్ర

By

Published : Nov 9, 2020, 5:36 PM IST

అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందజేయటంతో పాటు వారికి అన్యాయం జరగకుండా చూడటమే జగన్ ప్రభుత్వ లక్ష్యమని విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. నర్నీపట్నం నియోజకవర్గంలో మాకవరపాలెం మండలం గిడూతూరులో నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలతోపాటు మ్యానిఫెస్టోలో చేర్చని ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను ఎమ్మెల్యే స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ఆటో డ్రైవర్ కుటుంబం ఆత్మహత్య కేసు: సీఐ, హెడ్ కానిస్టేబుల్​కు బెయిల్

ABOUT THE AUTHOR

...view details