విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చెయ్యపేట మండలంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాదయాత్ర చేశారు. గోర్లెపాలెం నుంచి చిట్టియ్యపాలెం వరకు మొత్తం ఏడు గ్రామాల్లో పాదయాత్ర సాగింది. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాబూ జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాగునీటి ప్రాజెక్టుతో స్థానిక వ్యవసాయ భూములు సస్యశ్యామలం అవుతాయని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే వెంట దొండా రాంబాబు, స్థానిక వైకాపా నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
చోడవరం నియోజకవర్గంలో వైకాపా నేతల పాదయాత్ర - స్థానిక వ్యవసాయ భూములు సస్యశ్యామలం
చోడవరం నియోజకవర్గం బుచ్చెయ్యపేట మండలంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాదయాత్ర చేశారు. దొండా రాంబాబు, స్థానిక వైకాపా నేతలు ఎమ్మెల్యేతో కలిసి నడిచారు.
వైకాపా నేతల పాదయాత్ర