పాడేరులో వైకాపా నాయకులు కలెక్టర్ వినయ్చంద్పై చిందులు వేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకకు ఉదయం 10 గంటలకు రావాల్సిన కలెక్టర్… ఆలస్యంగా రావడం వల్ల కార్యక్రమాన్ని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అరకు ఎమ్మెల్యే పాల్గుణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ 11 గంటలకు వచ్చారు. దీనిపై అరకు వైకాపా నాయకులు చిందులు వేశారు. ఆదివాసీలంటే లెక్క లేదా? సమయపాలన లేదా అంటూ కలెక్టర్‌ను ప్రశ్నించారు. దీంతో అక్కడ పరిస్థితిని అదుపు చేసేందుకు అధికారులు కలగజేసుకుని వారిని వారింపజేశారు. విజయవాడలోని కొవిడ్ ఆసుపత్రిలో జరిగిన ప్రమాదం వల్ల జరిగిన వీడియో కాన్ఫరెన్స్ కారణంగా ఆలస్యం జరిగిందని చెప్పారు.
కలెక్టర్‌పై చిందులు వేసిన అరకు వైకాపా నాయకులు - visakha district paderu latest news
పాడేరులో జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకలకు కలెక్టర్ వినయ్‌చంద్ ఆలస్యంగా రావడం వల్ల అరకు వైకాపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీలపై చిన్నచూపు తగదంటూ మాట్లాడారు. అనంతరం అధికారులు కలగజేసుకుని వైకాపా నాయకులను వారించారు.
కలెక్టర్‌పై అగ్రహం వ్యక్తం చేసిన అరకు వైకాపా నాయకులు