ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డునపడ్డ వైకాపా నేతల విభేదాలు.. ఎస్.రాయవరంలో రచ్చ - payakaraopeta mla babu rao

విశాఖ జిల్లా ఎస్.రాయవరంలో వైకాపా నేతల విభేదాలు రచ్చకెక్కాయి. పాయకారావుపేట ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తంగా మారింది.

వైకాపా నేతల ర్యాలీ అడ్డగింత
వైకాపా నేతల ర్యాలీ అడ్డగింత

By

Published : Jan 2, 2022, 8:39 PM IST

Updated : Jan 2, 2022, 9:57 PM IST

విశాఖ జిల్లా ఎస్.రాయవరంలో వైకాపా నేతల విభేదాలు రచ్చకెక్కాయి. పాయకారావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు వ్యతిరేకవర్గం చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

దళితుల ఎమ్మెల్యే అని చెప్పుకున్న బాబూరావు.. దళితులకు అందించే సంక్షేమ పథకాలు, ఉద్యోగాలను అమ్ముకున్నారని వ్యతిరేక వర్గీయులు ఆరోపించారు. పార్టీ గెలుపు కోసం కష్టపడిన వారిని ఎమ్మెల్యే విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే తీరును ప్రశ్నిస్తే.. కులం పేరుతో వేధిస్తున్నారని నాయకులు, కార్యకర్తలు, పలువురు సర్పంచ్​లు ఆవేదన వ్యక్తం చేశారు. తమపై కక్ష గట్టి బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినదిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఇదీచదవండి :

Last Updated : Jan 2, 2022, 9:57 PM IST

ABOUT THE AUTHOR

...view details