ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రభుత్వం సంక్షేమ పాలన సాగిస్తుందని విప్ బూడి ముత్యాలనాయుడు అన్నారు.విశాఖ జిల్లా మాడుగుల మండలం వీరవిల్లి అగ్రహారం నుంచి గోటివాడ వరకు ప్రజల్లో నాడు - ప్రజలు కోసం నేడు కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో విప్ ముత్యాలనాయుడుతో పాటుగా అనకాపల్లి ఎంపీ సత్యవతి, వైకాపా శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు. పాదయాత్రలో గుర్తించిన సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాడుగుల నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని ఎంపీ సత్యవతి తెలిపారు. మహిళలు అందరూ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు
ప్రజా సమస్యలు పరిష్కరానికి కృషి చేస్తాం - Today in the People - Today's program for the people news in vishaka
విశాఖ జిల్లా మాడుగుల మండలంలోని వీరవిల్లి అగ్రహారం నుంచి గోటివాడ వరకు విప్ బూడి ముత్యాలనాయుడు, ఎంపీ సత్యవతి వైకాపా శ్రేణులు, మహిళలు కలిసి పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో గుర్తించిన ప్రజా సమస్యలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.
విశాఖజిల్లా మాడుగులలో వైసీపీ నాయకులు పాదయాత్ర