విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన వైకాపా నాయకులు, కార్యకర్తలు.. తెదేపా విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
గతంలో 36, 37 వార్డులకు చెందిన కేదారిలక్ష్మి, బంగారు రవిశంకర్.. దక్షిణ నియోజక వర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్తో కలిసి వైకాపాలో చేరారు. వైకాపా ప్రభుత్వ తీరు నచ్చక తెదేపాలో చేరుతున్నట్లు చెప్పారు. అనంతరం తెదేపా నాయకులు.. ఇరువురికి కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలు అందించారు.