విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయంలో... రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల మాజీ సర్పంచ్ల ఫొటోలను పురపాలక కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని వైకాపా నాయకులు నర్సీపట్నం ఆర్డీవోకు వినతిపత్రాన్ని అందజేశారు.
గతంలోనే.. మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణికి ఈ విషయమై విజ్ఞప్తి చేయగా.. అందరు సర్పంచ్ల ఫొటోలు పెట్టిస్తామని ఆమె హామీ ఇచ్చినట్టు వైకాపా నాయకులు తెలిపారు. ఈలోగా తెదేపా నేత అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు కావడం, కమిషనర్ కృష్ణవేణి బదిలీ అయ్యారన్నారు. ఈ కారణంగా.. ఆర్డీవోను కలిసిన పార్టీ నాయకులు మరోసారి ఈ విషయమై విజ్ఞప్తి చేశారు. పార్టీ నేత కోనేటి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆర్డీవోను కలిశారు.