విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో వైకాపా నాయకుల మధ్య అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయి. బుచ్చెయ్యపేట మండలం కోమాళ్లపూడి గ్రామంలో డెయిరీ డైరెక్టర్, వైకాపా నాయకుడు గెదేల సత్యనారాయణపై అదే పార్టీకి చెందిన నాయకులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సత్యనారాయణ కత్తిపోట్లుతో బయటపడ్డారు. దాడిలో గ్రామానికి చెందిన ముగ్గురు వాలంటీర్లతో పాటు తొమ్మిది మంది పాల్గొన్నారు.
వైకాపాలో వర్గ విభేదాలు... ఓ వ్యక్తిపై కత్తితో దాడి ! - వైకాపాలో వర్గ విభేదాలు...ఓ వ్యక్తిపై కత్తితో దాడి !
అంతర్గత విభేదాల కారణంగా వైకాపా నాయకులు ఘర్షణకు దిగిన ఘటన విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో కోమాళ్లపూడి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో డెయిరీ డైరెక్టర్, వైకాపా నాయకుడు గెదేల సత్యనారాయణపై అదే పార్టీకి చెందిన నాయకులు కత్తులతో దాడికి పాల్పడ్డారు.
సత్యనారాయణ పై దాడి జరగటం ఇది రెండో సారి. అప్పట్లో అయన ప్రత్యర్థులు నాటుతుపాకి ఉపయోగించి చంపేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన తృటిలో తప్పించుకున్నారు. వేరే పార్టీ నుంచి వైకాపాలో చేరినా.. ఆ పార్టీలో ముందునుంచి ఉంటున్న క్యాడర్‌తో ఈయనకు తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాలే హత్యాయత్నానికి దారి తీసినట్టు గ్రామస్థులు చెబుతున్నారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు...గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: విశాఖలో పలుప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం