వైకాపా 15 నెలల పాలనలో పర్యాటక శాఖ ఏం ప్రగతి సాధించిందని ఆదివారం ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహిస్తున్నారని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ప్రశ్నించారు. పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తన సొంత నియోజకవర్గంలో ఒక్క పార్కునైనా అభివృద్ధి చేశారా? అని అడిగారు. తెదేపా హయాంలో రాష్ట్రాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు. తెదేపా హయాంలో విదేశీయులు సైతం విహారం కోసం ఏపీకి వస్తే.. నేడు రాష్ట్ర ప్రజలే ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకొని పొరుగు రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి నెలకొందని విమర్శించారు.
'ఏం సాధించారని పర్యాటక దినోత్సవం నిర్వహిస్తున్నారు?' - mlc manthena satyanarayana raju latest news
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌పై ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పర్యాటక రంగాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. మంత్రి తన నియోజకవర్గంలో ఒక్క పార్కునైనా అభివృద్ధి చేశారా అని మంతెన ప్రశ్నించారు.
manthena satyanarayana raju
వైకాపా పాలనలో పర్యాటక రంగానికి ప్రాధాన్యం లేకుండా పోయిందన్నారు మంతెన. పర్యాటక రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న వేలాదిమంది జీవితాల్ని ఈ ప్రభుత్వం దెబ్బకొట్టిందని మండిపడ్డారు. అవంతి శ్రీనివాస్ బూటక మంత్రి అని ఆయన విమర్శించారు. ఇకనైనా పర్యాటక రంగంపై మంత్రి దృష్టి పెట్టాలని మంతెన సత్యనారాయణ రాజు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదీచదవండి: దాల్ సరస్సులో జోర్దార్గా పడవల రేస్