'ఎన్నికల టికెట్ కుటుంబసభ్యులకు ఇచ్చుకుంటున్నారు' - విశాఖ వైకాపా కార్యాలయంలో కార్యకర్తల నిరసన
విశాఖ వైకాపా కార్యాలయంలో జీవీఎంసీ ఎన్నికల కోసం 40మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేశారు. జాబితా విడుదలైన కొద్దిసేపటికి వైకాపా కార్యకర్తలు కొందరు నిరసన చేపట్టారు. పార్టీని నమ్ముకున్న వారికి ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. నేతల కుటుంబసభ్యులకు, బంధువులకే అవకాశం ఇచ్చారన్నారు. కొయ్య ప్రసాద్‌రెడ్డి, ఇతర నాయకులను అడ్డగించి నిలదీశారు. ఇదే వైఖరితో వెళితే ఎన్నికల్లో పార్టీ ఓడిపోతుందని స్పష్టంచేశారు.
విశాఖ వైకాపా కార్యాలయంలో కార్యకర్తల నిరసన