ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వ బడుల్లో ఆంగ్లమాధ్యమం స్వాగతించదగ్గ విషయం' - జీవో 2430 యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మద్దతు

"ప్రభుత్వ బడుల్లో ఆంగ్లమాధ్యమం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకురావాలంటే ఆంగ్లమాధ్యమంలో బోధన చాలా అవసరం. సంపన్నులకే కాకుండా బడుగు బలహీన వర్గాలూ ఆంగ్లంలో విద్యనభ్యసించే అవకాశం ఉంది. అందుకే దీనికి నా మద్దతు ఉంటుంది." యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

yarlagadda

By

Published : Nov 9, 2019, 10:16 AM IST

Updated : Nov 9, 2019, 12:49 PM IST

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జీవోను తాను స్వాగతిస్తున్నానని అధికార భాష సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో నలభై శాతం పాఠశాలల్లోనే తెలుగు బోధన ఉండేదనీ.. ఈ జీవోతో రాష్ట్రంలోని ప్రతి స్కూల్లో తెలుగు ఒక సబ్జెక్టుగా ఉంటుందని స్పష్టంచేశారు. ఈ జీవోతో బడుగ బలహీన వర్గాల పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదువుకునే అవకాశం ఉందన్నారు. అందుకే దీనికి తన మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు.

యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
Last Updated : Nov 9, 2019, 12:49 PM IST

ABOUT THE AUTHOR

...view details