ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'యారాడ దర్గాకు తాళాలు వేయటం సరి కాదు' - యారాడ దర్గాకు తాళాలు వేయటంతో కమిటీ సభ్యుల ఆగ్రహం

విశాఖ జిల్లాలోని యారాడ దర్గా భూముల వ్యవహారం.. న్యాయస్ధానంలో ఉన్నప్పటికి, అక్కడ తాళాలు వేయటం సరి కాదని దర్గా కమిటీ స్పష్టం చేసింది. దర్గాలో చందన ఉత్సవం సజావుగా జరిగేలా.. స్ధానిక పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం సహకరించాలని కమిటీ సభ్యులు కోరారు.

yarada dagra committe members fires for locking it
'యారాడ దర్గాకు తాళాలు వేయటం సబబు కాదు'

By

Published : Jun 28, 2021, 3:37 PM IST

విశాఖ జిల్లాలోని యారాడ దర్గా భూముల వ్యవహారం.. న్యాయస్ధానంలో ఉన్నప్పటికి ఏదో ఫిర్యాదు వచ్చిందని వక్ఫ్ బోర్డుకి సంబంధం లేకుండా అక్కడ తాళాలు వేయడం సరికాదని.. దర్గా కమిటీ స్పష్టం చేసింది. వందల ఏళ్ల క్రితం నిజాం కాలంలో ఈ యారాడ దర్గాకు భూములను ఇచ్చారని, అప్పటి నుంచి రెండున్నర వేల ఎకరాల భూమి.. దర్గా ఆధీనంలో ఉందని కమిటీ తెలిపింది. చందన ఉత్సవం .. సజావుగా జరగనీయకుండా అడ్డుకునేలా చర్యలు తీసుకోవడం ఆక్షేపణీయమన్నారు. ఈ వ్యవహారం హైకోర్టులో ఉన్న కారణంగా.. ఈ ఉత్సవ నిర్వహణకు స్ధానిక పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం సహకరించాలని కమిటీ సభ్యులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details