విశాఖపట్నం నగర మేయర్ అభ్యర్థిగా గోలగాని వెంకట హరి కుమారిని ఎన్నుకోవడం పట్ల జిల్లా యాదవుల సంక్షేమ సంఘం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. నర్సీపట్నంలో వారు అభినందన సభ నిర్వహించి.. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్‌ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో యాదవుల సంఘం అధ్యక్షుడు గుండుపాల జాగు రామకృష్ణ, కార్యదర్శి ధర్మసాగరం కొంప కన్నయ్య నాయుడు తదితరులు పాల్గొని ఎమ్మెల్యే గణేష్‌కి పుష్పగుచ్ఛాలు అందజేశారు.
నర్సీపట్నం ఎమ్మెల్యేకి యాదవ సంక్షేమ సంఘం కృతజ్ఞతలు - నర్సీపట్నంలో యాదవ సంఘం నేతల అభినందన సభ
విశాఖ మేయర్ పీఠానికి వెంకట కుమారిని ఎంపిక చేయడం పట్ల జిల్లా యాదవుల సంక్షేమ సంఘం నాయకులు నర్సీపట్నం ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలో వారు అభినందన సభ నిర్వహించారు.
నర్సీపట్నం ఎమ్మెల్యేకి యాదవుల సంక్షేమ సంఘం కృతజ్ఞతలు