ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్టాంప్ పేపర్‌పై హామీ - UTTHARANDHRA

మార్చిలో జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అడారి కిశోక్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

గెలిస్తే చేపట్టే హామీలను స్టాంప్ పేపర్ పై రాసిస్తా -ఎమ్మెల్సీ అభ్యర్ధి

By

Published : Feb 24, 2019, 4:07 PM IST

మార్చినెలలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అభ్యర్ధులు వినూత్నంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. బరిలో దిగుతున్న అడారి కిశోర్ ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. తాను గెలిస్తే చేపట్టబోయే హామీలను వంద రూపాయల ఇండియన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ పై రాసి ఇస్తూ ప్రచారం చేపట్టారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. సిపిఎస్ రద్దుతోపాటు వారానికి 5రోజులు పని దినాలు, మహిళా ఉద్యోగుల సమస్యలు, ఉమ్మడి సర్వీసు రూల్స్‌పై కోర్టులో ఉన్న కేసులను తొలగించేందుకు కృషి ఇలా 22 అంశాలను వంద రూపాయలు స్టాంప్ పేపర్ పేరు రాసి ఇస్తున్నారు. గెలిస్తే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తానని తెలిపారు. అందరి సహకారంతో ఎన్నికల్లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details