ప్రభుత్వం పంపిణీ చేసిన రేషన్ సరకుల్లో నాణ్యత లేదంటున్నారు లబ్ధిదారులు. విశాఖ జిల్లా పాడేరు పరిధిలో పంపిణీ చేసిన బియ్యం, కంది పప్పులో పురుగులు ఉన్నాయని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఎవరూ బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా లైన్లలో నిలబడి సరుకులు ఇళ్లకు తెచ్చుకుంటే నాణ్యత లోపించిన సరుకులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నాణ్యమైన సరుకులు పంపిణీ చేయాలని కోరుతున్నారు. ఈ సరకులు తింటే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని గిరిజనులు వాపోతున్నారు.
గిరిజనులు మనుషులు కాదా..ఈ సరకులు తినేదెలా..? - undefined
విశాఖ జిల్లా పాడేరు పరిధిలో ప్రభుత్వం పంపిణీ చేసిన రేషన్ సరకుల్లో పురుగులు ఉన్నాయని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఎలా తినాలని ప్రశ్నిస్తున్నారు.
రేషన్ సరుకుల్లో పురుగులిలా...తినేదెలా..??
Last Updated : Mar 31, 2020, 7:24 PM IST