ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్యంతో పాటు.. ధూమపానంపై అవగాహన - smoking kills

పొగ శరీరాన్ని పీల్చేస్తూ... అవయవాలను నాశనం చేస్తుంది. పొగతాగే వారితోపాటుగా పక్కనున్న వారికీ హాని కలిగిస్తుంది. హానికరమైన పొగాకుకు స్వస్తి పలకాలని ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది. పొగాకు బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించడానికి జిల్లాకో ధూమపాన నియంత్రణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఈ విభాగంలో పొగతాగేవారికి కౌన్సిలింగ్ ఇస్తూ... దీని బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు.

ధూమపాన నియంత్రణ విభాగం

By

Published : May 31, 2019, 1:35 PM IST

అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి

ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు వైద్యం అందించే సమయంలో... పొగతాగే అలవాటు ఉన్నట్లు గుర్తిస్తే వైద్యంతోపాటు... కౌన్సిలింగ్ ఇస్తున్నారు విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రి వైద్యులు. పాఠశాల, కళాశాలలో పొగ తాగడం వల్ల కలిగే అనర్ధాల గురించి విద్యార్థులకు వివరిస్తున్నారు. పొగ తాగడం వల్ల క్యాన్సర్​తో పాటుగా శరీరంలోని అవయవాలకు వ్యాధులు సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పొగతాగే అలవాటు మాన్పించాలంటే... దీని వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించడంతోపాటు... అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పిచింది. జిల్లాకో ధూమపాన నియంత్రణ విభాగాన్ని ఏర్పాటు చేసి... దీని ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఈ విభాగానికి వచ్చిన పలువురు ఇక్కడ అందిస్తున్న కౌన్సిలింగ్ ద్వారా పొగాకుకు దూరంగా ఉంటున్నారని సైకాలజిస్ట్ శ్యామల తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేసేందుకు ఈ విభాగం అధికారులు దృష్టి సారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details