ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు మత్స్యకార దినోత్సవం - వేలాది కుటుంబాల్లో చీకట్లు నింపిన అగ్నిప్రమాదం - ప్రపంచ మత్స్యకార దినోత్సవం

World Fisheries Day : ప్రపంచ మత్స్యకార దినోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో విశాఖ హార్బర్​లో జరిగిన అగ్నిప్రమాదం వేలాది మంది మత్స్యకారుల జీవితాల్లో చీకట్లు నింపింది. ఈ నెల 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం జరగనుండగా... ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించి సహకరించాలని ఆయా సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. కానీ, ఒక్క రోజు ముందు ఊహించని ప్రమాదం ఎంతో మందిని ఆర్థికంగా, మరెంతో మంది జీవనోపాధిని దెబ్బతీసింది.

world_fishries_day
world_fishries_day

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 20, 2023, 1:49 PM IST

Updated : Nov 21, 2023, 10:27 AM IST

World Fisheries Day : ప్రపంచ మత్స్యకార దినోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో విశాఖలో జరిగిన అగ్నిప్రమాదం వేలాది మంది మత్స్యకారుల జీవితాల్లో చీకట్లు నింపింది. ఈ నెల 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం జరగనుండగా... ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించి సహకరించాలని ఆయా సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. కానీ, ఒక్క రోజు ముందు ఊహించని ప్రమాదం ఎంతో మందిని ఆర్థికంగా, మరెంతో మంది జీవనోపాధిని బుగ్గిపాల్జేసింది.

జరిగిన ఘటనపై టీడీపీ జాతీయ నేత లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. హార్బర్‌ భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దారుణమని మండిపడ్డారు. ఈ ప్రమాదంలో నష్టపోయిన వారంతా రెక్కాడితే గానీ డొక్కాడని పేద మత్స్యకారులేనని లోకేశ్​ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవాలని జనసేనాని పవన్​ కల్యాణ్.. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో భారీ అగ్నిప్రమాదం - అగ్నికి ఆహుతైన 40 బోట్లు

వీధిన కుటుంబాలు అనేకం..పగలు, రాత్రి సమయం తెలియకుండా.. ఇల్లు వదిలి, రోజుల తరబడి కుటుంబాలకు దూరంగా సముద్రంలోకి వెళ్లి మత్స్యకారులు పడే కష్టం అంతా ఇంతా కాదు. ప్రాణాలకు గ్యారెంటీ లేని మత్స్యకారుల జీవన విధానం చాలా భిన్నంగా ఉంటుంది. కానీ, ఇవాళ విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం.. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మత్స్యకారులు జీవితాల్లో చీకట్లు నింపింది. క్షణాల వ్యవధిలో వ్యాపించిన మంటలు.. మత్స్యకారుల జీవనాధారమైన బోట్లు, సామగ్రిని బుగ్గిచేశాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా నిప్పంటించారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ నెల 21న మత్స్యకార దినోత్సవం నిర్వహించుకోవాలని ఆయా సంఘాల నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో.. ఊహించని ఈ ప్రమాదం కన్నీరు పెట్టిస్తోందని పలువురు నేతలు వాపోతున్నారు. ''ఇప్పటికే దాదాపు 40 పైగా బోట్లు బుగ్గిపాలయ్యాయి.. బోట్లలో నిద్రిస్తున్న వారు మంటల్లో చిక్కుకుని ఉండొచ్చు.. లక్షల్లో ఆస్తినష్టం జరిగింది'' అని బోట్ల యజమానులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఉత్సవాలకు అనుమతి కోరిన మత్స్యకార సంఘం నేతలు..మత్య్సకార దినోత్సవ నిర్వహణకు ప్రభుత్వం అనుమతించాలని మత్స్యకారుల సంఘం నాయకుడు గరికన పైడిరాజు.. నిన్న విజయవాడలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలు, మతాలు, పండుగలను ఒకే రకంగా చూడాలని, ప్రతి ఒక్కరి ఆత్మగౌరవాన్ని, హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ నెల 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా... ఉత్సవాలను నిర్వహించుకునేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు.

భారీగా నష్టం...ఫిషింగ్ హార్బర్​లో రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తుండగా.. 40కి పైగా బోట్లు కాలిపోయాయి. దీంతో సుమారు రూ.25 నుంచి 30 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. అమ్మకానికి సిద్ధంగా మత్య్స సంపద అంతా బూడిదపాలైందని బోటు యజమానులు, కళాసిలు కన్నీటి పర్యంతమయ్యారు.

ఆవేదన వ్యక్తం చేసిన అచ్చెన్న..ఫిషింగ్ హార్బర్​లోని అగ్ని ప్రమాదానికి భద్రతా చర్యలు లేకపోవడమే ప్రధాన కారణమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వరుస ప్రమాదాలు జరుగుతున్న కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కార్మికులు, మత్య్సకారుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని అచ్చెన్న ఆగ్రహించారు. రిషికొండ ప్యాలెస్ నిర్మాణంపై ఉన్న శ్రద్ధ.. ప్రజల భద్రతపై పెట్టాలని హితవు పలికారు.

ఫిషింగ్ హార్బర్‌ ప్రమాదం దురదృష్టకరం - బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి

Last Updated : Nov 21, 2023, 10:27 AM IST

ABOUT THE AUTHOR

...view details