విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలోని రక్త నిధి ఎంతో మంది ప్రాణాలకు అండగా నిలిచింది. 2003వ సంవత్సరం అప్పటి తెదేపా ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రం ఏర్పాటు చేశారు. అప్పటినుంచి రక్త దాతల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఇక్కడ నెలకు 150 నుంచి 200 మంది రక్త దానం చేస్తుంటారు. ఆసుపత్రిలో చేరే రోగుల కు అవసరమైన సమయంలో ఈ రక్తం అందిస్తున్నారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా రోగులకు రక్తం అవసరమైతే ఇక్కడి నుంచే సరఫరా చేస్తున్నారు. అనకాపల్లి లోని స్వచ్ఛంద సంస్థలు కళాశాల విద్యార్థులు అవగాహన పెంచుకుని తరచూ రక్తం దానం చేస్తుండటం అభినందనీయం.
'రోగుల పాలిట వరంగా ఎన్టీఆర్ రక్త నిధి' - anakapalli
2003లో అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో ఏర్పాటైన రక్త నిధి...ఆపదలో ఉన్న ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టింది. హాస్పిటల్ రోగులకే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాలకు సైతం రక్తం సరఫరా చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.
'రోగుల పాలిట వరంగా ఎన్టీఆర్ రక్త నిధి'
ముందుకొస్తున్న యువత...
రక్తదానంతో ఎంతో మందికి ప్రాణదానం చేయవచ్చు. ఒకప్పుడు అవగాహనా లేమితో రక్తం ఇచ్చేందుకు చాలా మంది వెనకడుగు వేసేవారు. ప్రస్తుతం సమాజంలో వస్తున్న మార్పు... రక్త దానంపై పెరుగుతున్న అవగాహనతో దాతల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. ఆరోగ్యంగా ఉన్నవారు మూడు నెలలకొకసారి రక్త దానం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు.