VISAKHA STEEL PLANT WORKERS RALLY : విశాఖలో స్టీల్‌ప్లాంట్ కార్మికులు, నిర్వాసితుల ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ డీఆర్ఎం కార్యాలయం నుంచి జీవీఎంసీ వరకు ర్యాలీ తలపెట్టారు. ర్యాలీని కూర్మన్నపాలెం జంక్షన్‌లో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసు నిర్బంధాన్ని ఛేదించుకుంటూ కార్మికులు ముందుకు సాగారు. జాతీయ రహదారిపైకి తరలివచ్చారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు రానున్న నేపథ్యంలో.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని.. కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
విశాఖలో స్టీల్‌ప్లాంట్ కార్మికుల ర్యాలీ.. అడ్డుకున్న పోలీసుల - విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ
STEEL PLANT WORKERS RALLY IN VIZAG : విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం జంక్షన్‌లో స్టీల్‌ప్లాంట్ కార్మికులు ర్యాలీ చేపట్టారు. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. పోలీసు నిర్బంధాన్ని ఛేదించుకుంటూ కార్మికులు ముందుకు సాగారు.
STEEL PLANT WORKERS RYALLY IN VIZAG