కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది డిమాండ్ చేశారు. ఈ పథకానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేస్తూ.. విశాఖలోని జీవీఎంసీ గాంధీ పార్కులో నిరసన చేపట్టారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బడ్జెట్ పెంచాల్సిందిపోయీ... రూ. 2 వేల కోట్లు తగ్గించడం శోచనీయమన్నారు.
'మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి' - ఉద్యోగ భద్రతా కల్పించాలని మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది ధర్నా
మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని ఈ పథకం కార్మికులు డిమాండ్ చేశారు. ఈమేరకు విశాఖలోని జీవీఎంసీ గాంధీ పార్కులో నిరసన చేపట్టారు.

మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి
కొందరు అధికార పార్టీ నాయకులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ పథకానికి రాబోయే బడ్జెట్లో నిధులు పెంచాలన్నారు. తమకు ప్రతినెలా 5వ తేదీలోగా జీతాలు చెల్లించాలన్నారు. ఈ పథకాన్ని ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచనను మార్చుకోవాలన్నారు.
ఇదీ చూడండి:'ధిక్కరణ కేసు'పై నేడు హై కోర్టులో విచారణ... హాజరు కానున్న డీజీపీ