విశాఖ జిల్లాలో ఉపాధి హామీ పథకం కూలీల బకాయిలు పెరుకుపోయాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో దాదాపుగా రూ.18.49 కోట్లు వరకు బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం తక్షణమే కూలీల బకాయిలు చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకన్న డిమాండ్ చేశారు. జాబ్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికీ పనికల్పించాలన్నారు. రోజుకి కూలీలకు రూ.600 వేతనం చెల్లించి, ఏడాదిలో 200 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు.
'ఉపాధి హామీ పథకం బకాయిలు వెంటనే చెల్లించాలి' - employment guarantee scheme arrears in visakhapatnam district
ఉపాధి హామీ పథకం బకాయిలు వెంటనే చెల్లించాలని విశాఖ జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా రూ.18.49 కోట్లు బకాయిలున్నాయని పేర్కొన్నారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పని కల్పించాలన్నారు.
!['ఉపాధి హామీ పథకం బకాయిలు వెంటనే చెల్లించాలి' workers demand immediate payment of employment guarantee scheme arrears in visakhapatnam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11457222-842-11457222-1618817390694.jpg)
'ఉపాధి హామీ పథకం బకాయిలు వెంటనే చెల్లించాలి'