అందోళనను ఉధృతం చేసేందుకు సమయాత్తమవుతున్న కార్మికులు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ 160 రోజులుగా ఆందోళన చేస్తున్న కార్మిక సంఘాలు దిల్లీ స్థాయిలో పోరాటానికి తొలిఅడుగు వేశారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులను కలిసి సమస్య వివరించాలని నిర్ణయించారు.
ఇందుకోసం దిల్లీ వెళ్లారు. పార్లమెంట్ లోపలా, బయటా విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి మద్దతు తెలపాలని విన్నవించనున్నారు. కేంద్రమంత్రులనూ కార్మికసంఘం నేతలు కలవనున్నారు.
ఇదే సమయంలో భాజపా నేతలు విశాఖ స్టీల్‌ప్లాంట్ నిర్వాసితులను దిల్లీ తీసుకెళ్లారు. కేంద్రమంత్రులతో కలిపిస్తామని, రాజకీయ నేతల వలలో పడొద్దని నచ్చజెప్తున్నారు. జాతి ప్రయోజనాల కోసం ఆస్తులు వదులుకుంటే ఇప్పటి వరకు తమకు న్యాయం చేయలేదనే విషయాన్ని కేంద్రపెద్దలకు వివరిస్తామంటున్నారు నిర్వాసితులు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వేలాదిమంది కార్మికులతో ఆగస్టు మొదటివారంలో దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కార్మికసంఘాలు ఆందోళనకు దిగనున్నాయి.
ఇదీ చదవండి: