ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Protest: విశాఖ ఉక్కు కార్మికుల ఆందోళన.. అరెస్టు చేసిన పోలీసులు - ap latest news

Steel plant workers arrest: విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. కార్మికులు నిరసన చేపట్టారు. ప్రభుత్వ అతిథి గృహం వద్ద కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేయగా.. వారిని పోలీసులు అరెస్టు చేశారు.

workers arrest for protesting against steel plant privatisation in vishakapatnam
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికుల ఆందోళన

By

Published : Feb 12, 2022, 3:56 PM IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికుల ఆందోళన

Steel plant workers arrest: విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ప్రభుత్వ అతిథి గృహం వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి.. విశాఖ పర్యటన నేపథ్యంలో.. కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details