విశాఖ తూర్పు నియోజక వర్గం పరిధిలో నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదలపై తెదేపా మహిళలా నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆధ్వర్యంలో ఆందోళన తెలిపారు. జగన్ ప్రభుత్వం వచ్చాక పేదలు బతికే పరిస్థితి లేదన్నారు. అన్ని సరుకుల ధరలు పెరిగాయని.. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
నిత్యావసర ధరల పెరుగుదలపై తెదేపా మహిళల ధర్నా - Mla Velagapudi Ramakrishna Babu
పెరిగిన ధరలను నిరసిస్తూ తెదేపా విశాఖ తూర్పు నియోజక వర్గం మహిళా నేతలు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు నేతృత్వంలో నిర్వహించిన ధర్నాలో తెదేపా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నిత్యావసర ధరల పెరుగుదలపై తెదేపా మహిళల ధర్నా