విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం వర్తనాపల్లి గ్రామంలో గుడి చందాల విషయమై ఇరు వర్గాలకు మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తికి తీవ్ర గాయలవగా.. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఓ వర్గానికి చెందిన మహిళలు ఆరోపించారు. ఘటన బుధవారం జరగ్గా.. ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అధికార పార్టీకి చెందిన సర్పంచ్ చెప్పడంతోనే దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయలేదని.. వారు స్వేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడిన సీఐ .. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
వ్యక్తిపై దాడి.. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఓ వర్గం ఆరోపణ
విశాఖ జిల్లా ఏజెన్సీ గుడి చందాల విషయంలో జరిగిన దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితుడి తరఫు వర్గం వారు ఆరోపించారు. పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. గాయపడిన వ్యక్తిని పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పరామర్శించారు.
వ్యక్తిపై దాడి.. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఓ వర్గం ఆరోపణ
గాయపడిన వ్యక్తి ని పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పరామర్శించారు. పోలీసుల తీరుపై ఆమె విమర్శలు చేశారు. పోలీసులు న్యాయం చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చిరించారు.
ఇదీ చదవండి:తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ, పది మందికి గాయాలు